నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల మండలంలోని పలు దినపత్రికలలో ప్రచురితమైన కథనాలకు చెలించిన ఆయన సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి నిరాశ్రయులైన, నిరుపేద కుటుంబాలకు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ,అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు తన స్నేహితుల సహకారంతో మండలంలోని 20 బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు తన స్నేహితుల సహకారంతో ఆర్థిక సహాయం చేసినందుకు తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ముందునుముందు బాదిత కుటుంబాలకు అర్హత కలిగిన ప్రభుత్వ పథకాలు కూడా అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా పత్రికలలో వచ్చిన కథనాలకు స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం చేసినందుకు మండలానికి చెందిన జర్నలిస్టులు తాహసిల్దార్ ను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ నిర్మలాదేవి,ఆర్ ఐ పాండురంగారెడ్డి,జహురుద్దీన్, శ్రీను నాయక్,కార్యాలయ సిబ్బంది,పత్రికా విలేకరులు,తదితరులు పాల్గొన్నారు.



