Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ,ప్రైవేటు, పాఠశాల విద్యార్థులు ఉదయమే అన్ని గ్రామాలలో ప్రధాన వీధిలో గుంట తిరుగుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ గీతాలను పాడుతూ, నినాదాలు చేస్తూ బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు.

తహసిల్దార్  కార్యాలయం తహసిల్దార్ స్వప్న, ఎంపీడీవో కార్యాలయం పై గీతాంజలి, వ్యవసాయ కార్యాలయంపై, ఏవో సిద్ధార్థ, మహిళా సమైక్య భవనంపై అధ్యక్షురాలు, పోలీస్ స్టేషన్పై ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు, పశు వైద్య కార్యాలయంపై డాక్టర్ శివరాజ్, పిఎసిఎస్ కార్యాలయం పై సి ఓ బాల్ రెడ్డి, ఎమ్మార్సీపై ఎంఈఓ సరస్వతి, అంబేద్కర్ కళాభవన్ పై అధ్యక్షులు దేవయ్య, బిజెపి పార్టీ కార్యాలయంపై అధ్యక్షులు నరేష్ నాయక్, గ్రామపంచాయతీలలో సర్పంచులు . ప్రభుత్వ ,ప్రైవేటు పఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాలను ఎగరవేశారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -