Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందిన్నారు.

రాజ్యాంగాన్నీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రాజ్యాంగం గుర్తించబడిందని, రాజ్యాంగం రచించడానికి అహర్నిశలు కష్టపడి అందులో స్వేచ్ఛ, సమానత్వము, న్యాయం, ధర్మం అందరికీ సమానంగా ఉండాలని తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం ఆట, పాటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -