Monday, January 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..

ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముధోల్ లో  తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లవకుమార్, మండల విద్యా వనరుల కార్యాలయంలో విద్యాధికారి రమణ రెడ్డి ,పొలీస్ స్టేషన్ లో సీఐ రవీందర్ నాయక్, వ్యవసాయ పరిశోధన స్థానం లో శాస్త్ర వేత్త డా.దినేష్,ఎడిఏకార్యాలయంలో ఏడీ ఏ శ్రీనివాస్ రాజు, ఐకెపి కార్యాలయంలో అధ్యక్షురాలు జయాశీల ముధోల్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్ శబనా బేగం, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ సరోజని,ఆశ్రమ పాఠశాల లో ప్రదానోపాధ్యాయు లు సూర్యదాస్, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు షఫీ ఉల్లాఖాన్, జెండా ను ఎగరవేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో డా.అనిల్  ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కనకమహాలక్ష్మి, ఆయా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు పాఠశాలల్లో  ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీలలో  సర్పంచ్ లుత్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు.  రభింద్రా, అక్షర, శ్రీవిద్యా, భాష్యం, సంకల్పం పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వాడవాడలో త్రివర్ణ పథకం రెపరేపలాండింది. పాఠశాలల్లో విద్యార్థులు కు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -