Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్య ద్వారానే గిరిజనుల అభివృద్ధి: సర్పంచ్ ధర్మానాయక్ 

విద్య ద్వారానే గిరిజనుల అభివృద్ధి: సర్పంచ్ ధర్మానాయక్ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
విద్య ద్వారానే గిరిజనలు అభివృద్ధి చెందుతారని, తండాలలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలని చదివే అన్నిటికీ మూలమని సర్పంచ్ ధర్మానాయక్ చెప్పారు. సోమవారం మండలంలోని కాటోని గడ్డ తండా ప్రభుత్వ పాఠశాలలో విద్యపై  ఏర్పాటు చేసిన సమావేశానికి  ఈదులబ్బాయి తాండ సర్పంచ్ ధర్మానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలకు దూరంగా రోడ్డు సౌకర్యాలు లేక ఎంతోమంది గిరిజనుల చదువుకు దూరమయ్యారని, చదువు లేకనే గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక తాండాలలో మూతబడిన పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తండాల్లో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ పాఠశాలకు పాఠశాలకు వెళ్లి అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని తండాకు, మండలానికి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే బాధ్యత విద్యార్థుల పైన ఉందని సూచించారు. విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యతను గుర్తించి వారికి అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయుల పని ఉందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలనే తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. 

విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి బహుమతులను అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు సర్పంచ్ ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శిని శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో  ప్రధానోపాధ్యాయురాలు విజయ్ కుమారి, ఉపాధ్యాయురాలు మంజుల, పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్, ఉప సర్పంచ్ రవి నాయక్, గ్రామ పెద్దలు చక్రి నాయక్ , నాను నాయక్, లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -