Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శవంతుడు కంఠాలి గ్రామ సర్పంచ్ నాగనాథ్

ఆదర్శవంతుడు కంఠాలి గ్రామ సర్పంచ్ నాగనాథ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామ సర్పంచ్ నాగనాథ్ తన ఆదర్శవంతమైన భావనను విద్యార్థులతో పంచుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ భవిష్యత్తుకు పునాది అయిన చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సర్పంచ్ మరో ఆదర్శ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మిడ్ డే మీల్స్ పథకం కింద భోజనం చేసే విద్యార్థులకు పరిశుభ్రంగా, సౌకర్యంగా భోజనం అందించాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ ప్లేట్లు , వాటర్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆరోగ్య అవగాహన పెరగడమే కాకుండా, శుభ్రత, క్రమశిక్షణ వంటి విలువలు అలవడేలా చేయడం సర్పంచ్ ముఖ్య లక్ష్యంగా నిలిచింది. చిన్నారుల చిరునవ్వులే తన పాలనకు సర్టిఫికేట్ అన్నట్టుగా, పిల్లల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్  సేవాభావం నిజంగా ప్రశంసనీయం. గ్రామ అభివృద్ధితో పాటు విద్య, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తును ముందుండి నడిపిస్తున్న నాయకుడిగా మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించారు. అంతకుముందు గ్రామపంచాయతీ భవనంలో పథకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ , ఉప సర్పంచ్ , గ్రామ కార్యదర్శి, ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెట్టి సంతోష్ కుమార్,  గ్రామ పెద్దలు మురళి పటేల్, ఉపాధ్యాయ బృందం ,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -