- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పడంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వాగ్మరే విజయకుమారి సంజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా గొప్పతనన్ని సర్పంచ్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం తో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



