Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ నయాబ్ తహశీల్దార్ జుక్కల్ హేమలత

ఉత్తమ నయాబ్ తహశీల్దార్ జుక్కల్ హేమలత

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నయాబ్ తహసీల్దార్ ను జిల్లా అడిష్ నల్  కలెక్టర్ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందించారు. సోమవారం జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లాలోని ఉత్తమ సేవలందించిన జుక్కల్ నయాబ్ తహసిల్దార్  ఎంపిక చేసి వారిని ప్రశంసా పత్రంతో పాటు సత్కరించడం జరిగింది. అందులో భాగంగా సోమవారం నాడు సన్మాన కార్యక్రమంలో నయాబ్ తాసిల్దార్ హేమలతను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికలను అందజేశారు. జుక్కల్ మండలంలో నయాబ్ తహసిల్దార్ విధులు చేపట్టిన నుండి  కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా వెనుకబడిన పేద ప్రజలకు సేవలను అందించారు. నయాబ్ తహసీల్దార్ కు మండలంలో మంచి గుర్తింపు ఉంది . ముక్కుసూటితనంతో పనులు చేయడం ఆమె వలనే  సాధ్యపడింది. జిల్లా కలెక్టర్ ఆమె చేసిన  సేవలకు గుర్తింపుగా ఎంపిక చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -