- Advertisement -
నవతెలంగాణ-టేకుమట్ల
వెలిశాల గ్రామంలో ఏకలవ్య సంఘం మండల అధ్యక్షుడు కేతిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం మండల అధ్యక్షుడు కేకరి శ్రీనివాస్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేలిశాల గ్రామ సర్పంచ్ బొడ్డు తిరుపతి, ఉపసర్పంచ్ ఎండి అఫ్జల్, వార్డు మెంబర్లు, ఏకలవ్య సంఘ మండల ప్రధానకార్యదర్శి దుగ్యాల రమేష్, ఉపాధ్యక్షులు మానుపాటి రవి, దుగ్యాల సారయ్య, కేతిరి రాజయ్య, నావచైతన్య స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



