Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచుల సంఘం మండల అధ్యక్షులుగా రమేష్ నాయక్

సర్పంచుల సంఘం మండల అధ్యక్షులుగా రమేష్ నాయక్

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ  
సర్పంచ్ ల సంఘం ఊరుకొండ మండల అధ్యక్షులుగా గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైన జర్పులావత్ రమేష్ నాయక్ ను మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎన్నుకున్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఊరుకొండ మండల కేంద్రంలో సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నికైన రమేష్ నాయక్ కు ఆయా గ్రామాల సర్పంచులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఊరుకొండ మండలంలో పేరుకుపోయిన పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేవిధంగా కృషి చేస్తానని తెలిపారు.

ఊరుకొండ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్ష పదవికి  మద్దతు తెలిపిన ఆయా గ్రామాల సర్పంచులు గుడిగానిపల్లి సర్పంచ్ రుక్మారెడ్డి, తిమ్మన్నపల్లి సర్పంచ్ రేణమ్మతిరుపతయ్య, జగబోయిన్ పల్లి సర్పంచ్ సోనీనరసింహ, బాల్యలోక్య తండా సర్పంచ్ అంజమ్మ హనుమంతు, నర్సంపల్లి సర్పంచ్ శైలజశ్రీశైలం, రాచాలపల్లి సర్పంచ్ మహేష్, రేవల్లి సర్పంచ్ బంగారు, రాంరెడ్డిపల్లి సర్పంచ్ అలివేలుఆంజనేయులు, బొమ్మరాసిపల్లి సర్పంచ్ తిరుపతమ్మశివయ్య, ఊరుకొండ సర్పంచ్ మంజులశ్రీనివాసులు, జకినాలపల్లి సర్పంచ్ శేఖర్ యాదవ్ లు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -