రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలో మూడో స్థానం సాధించిన విద్యార్థినికి ప్రశంసా పత్రం అందజేత

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం ఆదర్శ పాఠశాలలో బైపిసి ప్రథమ సంవత్సరం చదువుతున్న వైష్ణవి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో నిజామాబాద్ జిల్లా నుంచి మూడోస్థానం నిలిచారని పాఠశాల ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. అండర్ 19 కబడ్డీ పోటీల్లో తమ ఆదర్శ పాఠశాల నుంచి అబ్రార్, ప్రేమ్ లు చక్కటి ప్రతిభను కనబడుచడంతో, వైష్ణవి తో పాటు వారికి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, సురేష్, మహమ్మద్ జైనులాబిన్, తదితరులు పాల్గొన్నారు
Spread the love