Tuesday, January 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంచి సందేశంతో 'యుఫోరియా'

మంచి సందేశంతో ‘యుఫోరియా’

- Advertisement -

భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేశ్‌ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా గుణ శేఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐపీఎస్‌ శంఖ బ్రాతా భక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు గుణ శేఖర్‌ మాట్లాడుతూ,”యుఫోరియా’ అంటే పట్టలేని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం. పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకి వెళ్తే యుఫోరిక్‌ మూమెంట్‌ ఉంటుంది. అలాంటి మూమెంట్‌లో మనల్ని మనం కంట్రోల్‌ చేసుకోవాలి. అలా మనం కంట్రోల్‌ చేసుకోలేక అదుపు తప్పితే జీవితం నాశనం అవుతుంది. యుఫోరియా ఎంత సరదాగా ఉంటుందో.. ఆ సరదా తీర్చేలా చిత్రం ఉంటుంది.

ఇది కేవలం యూత్‌ సినిమానే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉంటుంది. పేరెంటింగ్‌ సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా చెడిపోతారో చూపించాం. పిల్లలు పెడదారి పడితే సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ మూడు అంశాల చుట్టూనే ఈ మూవీని తీశాం. అన్ని తరాలకు చెప్పాల్సిన కథ అని నా పిల్లలు, ఫ్యామిలీ ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించారు. అలా అని ఈ సినిమా ఏ మాత్రం ఉపన్యాసం ఇచ్చినట్టుగా కూడా ఉండదు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’లా ఆద్యంతం అలరించే కమర్షియల్‌ చిత్రంగా ‘యుఫోరియా’ ఉంటుంది. ఎంటర్టైన్‌ చేస్తూనే ఓ మెసెజ్‌ ఇచ్చేలా సినిమాని రూపొందించాం’ అని అన్నారు. ‘ఈ మూవీలో నాకు కమిషనర్‌ పాత్ర అంటేనే చాలా ఇష్టం. భూమిక ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌లా అలానే ఉంటారు. సారా అర్జున్‌ ‘ధురంధర్‌’తో నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అయ్యారు. మళ్లీ ఈ చిత్రంతో సారా అర్జున్‌ అందరినీ ఆకట్టుకుంటారు. ఫిబ్రవరి 6న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని నిర్మాత నీలిమ గుణ అన్నారు. భూమికతోపాటు రోనిత్‌, నటుడు విఘ్నేశ్‌ గవిరెడ్డి, పృథ్వీరాజ్‌ అడ్డాల,లిఖిత యలమంచలి వంటి తదితర నటీనటులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -