– గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.50 కోట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
– ‘బతుకమ్మ’ కోసం భూమిని విరాళంగా ఇచ్చిన రైతు తిరుపతిరెడ్డిని సత్కరించిన మంత్రి
నవతెలంగాణ-భీమదేవరపల్లి
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణకు రూ.50 కోట్లు కేటాయించామని, రైతులు సహకరిస్తే పనులు పూర్తిచేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలకు నియోజకవర్గంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రంగాయపల్లి గ్రామ పంచాయతీకి బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం రూ.40లక్షల విలువైన 33గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన తిరుపతి రెడ్డిని సోమవారం సత్కరించారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి గ్రామంలో ముందస్తు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అవసరమైతే వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు గ్రామ సమస్యలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



