సోషల్ మీడియా ప్రచారంతో మల్లాపూర్‌లో గందరగోళం
ట్రస్ట్ కార్స్‌పై జనం ఆగ్రహం
రాళ్లతో దాడి.. నిర్వాహకుల అరెస్ట్
నవతెలంగాణ – చర్లపల్లి
‘రూ.26 వేలకే కారు’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అమాయకులను మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో జరిగింది. ఈ ఘటనతో ఆగ్రహించిన కొనుగోలుదారులు రాళ్లతో దాడి చేసే వరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకెళ్తే.. మల్లాపూర్‌లో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ’26 వేలకే కారు’ అంటూ ట్రస్ట్ కార్స్ నిర్వాహకులు మోV్‌ా్ద రోషాన్ కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశారు. జనం సోమవారం భారీ సంఖ్యలో షాపు వద్దకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కార్లు లేవని నిర్వాహకులు చెప్పడంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జనాన్ని అక్కడి నుంచి పంపించి ట్రస్ట్ కార్స్ నిర్వాహకులను అరెస్టు చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తప్పుదారి పట్టించే సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
రూ.26 వేలకే కారు అంటూ మోసపూరిత ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



