నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ సవరణ జీవో (103)ని జారీ చేయడం పట్ల హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు బి అరుణ్‌కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, కోశాధికారి బి రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డెస్క్ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రభుత్వం 103 జీవోను విడుదల చేయటం అభినందనీయమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ ప్రియాంకకు ధన్యవాదాలు ప్రకటించారు.
జీవో సవరణ అభినందనీయం : డీజేఎఫ్‌టీ
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో మీడియా అక్రిడిటేషన్ల జీవో 252ను సవరించి 103 జీవోను విడుదల చేయడం అభినందనీయమని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిస్సార్, సహాయ కార్యదర్శి పి విజయ, నాయకులు లలిత, జ్యోతిబసు, శేఖర్, శంకరయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై డీజేఎఫ్‌టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. జీవో సవరణపై కీలకంగా వ్యవహరించిన సీఎం రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ సవరణ జీవోపై హెచ్‌యూజే హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



