Tuesday, January 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెండ్లి కోసం మంచులో 7 కి.మీ. నడిచిన వరుడు

పెండ్లి కోసం మంచులో 7 కి.మీ. నడిచిన వరుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు పెళ్లిళ్లకూ అడ్డంకిగా మారింది. మండీ జిల్లా బునాలీఘర్‌కు చెందిన గీతేశ్‌ ఠాకుర్‌కు ఈ నెల 23న, 7 కిలోమీటర్ల దూరంలోని బైచాదీ గ్రామానికి చెందిన ఉషా ఠాకుర్‌తో వివాహం జరగాల్సి ఉంది. తీవ్ర మంచు కారణంగా రహదారులు మూసుకుపోవడంతో గీతేశ్‌ కాలినడకన వధువు గ్రామానికి చేరుకున్నారు. 3–4 అడుగుల ఎత్తున పేరుకుపోయిన మంచులోనే వివాహ వేడుకలు పూర్తయ్యాయి. అనంతరం 25న వధువును తీసుకుని ఇద్దరూ మళ్లీ నడిచే స్వగ్రామానికి చేరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -