– బిందె నీటి కోసం ప్రజల అవస్థలు
– పానిషీ తండ గ్రామపంచాయతీలో నీటి కొరత ఘాటు
– అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
– చుక్క నీటికోసం కిలోమీటర్ల ప్రయాణం
– పన్య తండ ప్రజల దుస్థితి
నవతెలంగాణ-రాయపర్తి : పానిషీ తండ గ్రామపంచాయతీ పరిధిలోని పన్య తండాలో త్రాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు మహిళలు, వృద్ధులు బిందెలతో దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గ్రామంలో సరఫరా అవుతున్న నీరు సరిపోకపోవడంతో ప్రజలు గంటల తరబడి నీటి కోసం వేచి చూస్తున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో సమస్య మరింత ఘాటుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే కొత్త బోర్లు వేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
పన్య తండాలో తీవ్ర త్రాగునీటి సంక్షోభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



