Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్రంపహడ్ జాతర ఏర్పాట్లు పరిశీలించిన వరంగల్ సీపీ

అగ్రంపహడ్ జాతర ఏర్పాట్లు పరిశీలించిన వరంగల్ సీపీ

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండలం అగ్రంపహడ్‌లోని సమ్మక్క సారలమ్మ వన దేవతల జాతర ఏర్పాట్లను వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల అగ్రంపహడ్ గ్రామంలో ప్రతి సంవత్సరం వేలాది భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ ఈ జాతర ఆధ్యాత్మిక మహిమలతో కూడిన పండుగగా పేరొందింది. ముందుగా వన దేవతలను దర్శనం చేసుకున్న సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు స్థానిక పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతల ఆశీస్సులు అందజేశారు.

భక్తుల సుగుణాల కోసం ప్రార్థనలు చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా, వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ ప్లాన్‌ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ బందోబస్తు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ సంతోష్ జాతర మార్గదర్శకాలు, ట్రాఫిక్ ప్లాన్ వివరాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కూమార్, పరకాల ఏసీపీ సతీష్ బాబు, స్థానిక సీఐ సంతోష్, దామేర ఎస్సై కె. అశోక్, ఈఓ నాగేశ్వరరావు, కమిటీ చైర్మన్ వంచ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -