Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుకున్న సోలిపురం సర్పంచ్..

మానవత్వం చాటుకున్న సోలిపురం సర్పంచ్..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
గ్రామ ప్రజల సంక్షేమం కోసం సోలిపురం గ్రామపంచాయతీ కార్మికుడిగా కొన్ని సంవత్సరాలుగా పనిచేసి మృతి చెందిన ఇరిగి చంద్రయ్య కుటుంబానికి  గ్రామపంచాయతీ నుండి అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని గత సర్పంచ్ లు అందించకపోయారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నకరేకంటి మురళీకృష్ణ  మంగళవారం ఆ కుటుంబ సభ్యులకు రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని తమ సొంత డబ్బులను అందజేసి మానవత్వం చాటుకున్నాడు.

ఈ సందర్భంగా సర్పంచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ .. గ్రామంలో చాలీచాలని వేతనాలకు పనిచేసిన గ్రామపంచాయతీ కార్మికులను గౌరవించుకున్నప్పుడే గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు గ్రామపంచాయతీ కార్మికులు నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తారని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుడి కష్టాన్ని గుర్తించి ఆ కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ మురళికి మండలంలోని  గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ , గ్రామ ప్రజలు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భరత్ , వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -