Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాకూబ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు బహుమతుల పంపిణీ 

యాకూబ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు బహుమతుల పంపిణీ 

- Advertisement -

ఎండి సలీం కు అభినందనలు 
నవతెలంగాణ – ఆలేరు 

ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎండి యాకూబ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఎండి సలీం బహుమతులు పంపిణీ చేశారు. సోమవారం ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండా ఎగురవేసి అనంతరం పట్టణ ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థులతో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.

77 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన వివిధ క్రీడ పోటీలలో పాల్గొన్న  విద్యార్థులందరికీ బహుమతులు అందజేయడం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు మహమ్మద్ సలీం ముందుకు రావడం విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను  గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యాభ్యాసం ద్వారానే పేదరికాన్ని జయించవచ్చు అన్నారు. ప్రభుత్వ పాఠశాల లో తమ పాఠశాల విద్యాబోధనలో మొదటి స్థానం రావడం పట్ల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి పట్టుదలే అంటూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ మాజీ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ మొరిగాడి మహేష్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు ఎండి సలీం, ఎండి ఖలీల్, ఉపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి, శంకరయ్య, ఎం శ్రీధర్,  ఏ హేమలత,  పీ డి పూల నాగయ్య, డి వెంకటేష్, సైదులు, మేఘరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -