నవతెలంగాణ- చండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మండల 2వ, 3వ , 5వ ర్యాంకులు సాధించిన స్థానిక సన్ షైన్ హై స్కూల్ విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాదులోని వారి కార్యాలయానికి ఆహ్వానించి మండల 2వ ర్యాంకు సాధించిన చెరుపల్లి శృతి, మండల 3వ ర్యాంకు సాధించిన చెదురువెల్లి హాసిని, మండల 5వ ర్యాంక్ సాధించిన రావిరాల వైష్ణవి లను శాలువాలు కప్పి మెమోంటోలను అందించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో అత్యున్నత స్థానాలను పొందాలని తద్వారా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని చదువులో ఇదేవిధంగా ముందుకు సాగుతూ మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానాన్నీ కల్పించాలని ఆశించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ మా సన్ షైన్ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుంటారని తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశించారు.



