Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్రంపాడ్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

అగ్రంపాడ్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
అగ్రంపాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా. అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డా. అప్పయ్య.. జాతీయ రహదారిపై ఊరుగొండ, గూడెప్పాడు, కటాక్షపూర్, అక్కంపేట ప్రధాన ఆర్చి వద్ద మెడికల్ ఎమర్జెన్సీ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సెంటర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న 22 మినీ మేడారం జాతరల్లో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.జాతర సబ్ సెంటర్‌లో కరెంటు, గ్రౌండ్ మ్యాట్, టాప్ మ్యాట్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని మెడికల్ ఆఫీసర్ స్పందన ఈవో దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిఎంహెచ్వో.. సౌకర్యాలు కల్పించాలని ఈవోను ఆదేశించారు.ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు చికిత్సలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించారు. పరిశుభ్రత, సిబ్బంది హాజరు, ప్రసూతి సేవలు, అత్యవసర సేవల అమలుపై స్పందన నుంచి వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డా. అప్పయ్య స్పష్టం చేశారు.ఈ తనిఖీలో స్పెషల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ స్పందన, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -