నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చెస్ క్లబ్ ఫౌండర్, ఎన్ఆర్ఐ సుధీర్ కోదాటి దాదాపు 500 చెస్ బోర్డులను ఎంఈఓ రాజాగంగారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేధో వికాసం ఎంతో అవసరమని, విదేశాల్లో ఉన్నా మాతృభూమిపై ప్రేమతో సేవలు అందించడం ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సునిత, ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఎస్సై ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, ఎఎంసి చైర్మన్ రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాయణ గుప్తా, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు లింబాద్రి, దయాకర్ రెడ్డి, చెస్ క్లబ్ సభ్యులు కిరణ్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



