Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువతను ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్

యువతను ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్

- Advertisement -

– కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మారుమూల తండా గ్రామంలో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తచెరువు తండా గ్రామంలో సర్పంచ్ లకావత్ సంతోష్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్బంగా కొత్తచెరువు తండా, కోనాపూర్ గ్రామాలకు చెందిన యువతకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను కోనాపూర్ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి తో కలిసి క్రికెట్ టోర్నమెంట్   ప్రారంభించిన అనంతరం సర్పంచ్ సంతోష్ మాట్లాడారు.

మారుమూల గ్రామాల్లో ఉన్న యువతలో క్రీడా నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని వెలికి తీసే ప్రయత్నం చేస్తే క్రీడా ఆణిముత్యాలు బయటకు వస్తారన్నారు. సదుద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 6 జట్లు పాల్గొనగా కె.జి హరీష్ టీం విన్నర్ గా, పాలేపు విజయ్ టీం రన్నర్ గా నిలిచాయి. విజేత జట్లకు సర్పంచ్ లగావత్ సంతోష్, సర్పంచ్ రెక్కల అరుణ్ రెడ్డిలో బహుమతులను అందజేశారు. విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -