- Advertisement -
నవతెలంగాణ – బంజారా హిల్స్
వీధి శునకాల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాల పాలైన ఘటన మంగళవారం ఖైరతాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్ బడా గణేష్ వెనుకలే ఉన్న శ్రీనివాస్ నగర్లో ఓ చిన్నారి వారి నివాసము ముందు ఆడుకుంటుడగా వీదికుక్కలు ఒక్కసారిగా వచ్చి బాలికపై దాడి చేశాయి. దీంతో చిన్నారి పాక శార్వి బిగ్గరగా అరిచింది. అయినా శునకాలు విడవలేదు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి వారి నివాసితులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే స్పందించి శునకాలను తరిమికొట్టారు. బాలికను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ లోని రెయిన్ బో కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి యూకేజీ చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.
- Advertisement -



