Tuesday, January 27, 2026
E-PAPER
Homeజిల్లాలుమున్సిపల్ ఎన్నికల కోడ్ కూసింది 

మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసింది 

- Advertisement -

– రెండవ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల
– 17 మంది వార్డ్ ఆఫీసర్లు పర్యవేక్షణలో ఎన్నికలు
– 28 నుండి 30 వరకు నామినేషన్ల స్వీకరణ 
– 11 నా ఎన్నికలు, 13 నా ఫలితాలు 
నవతెలంగాణ –  కామారెడ్డి 

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2వ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. 2026 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలు, కార్యక్రమాల వివరాలను అధికారికంగా ప్రకటించారు.  రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను ప్రకటించింది. దీంతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ లో కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మూడు గదులను ఏర్పాటు చేశారు.

రెవెన్యూ సెక్షన్ గదిలో ఐదుగురు వార్డు ఆఫీసర్ ల ఆధ్వర్యంలో ఒకటి నుండి 15 వార్డుల వరకు, కౌన్సిల్ హల్ గదిలో పదిమంది వార్డు ఆఫీసర్ ల ఆధ్వర్యంలో 16వ వార్డు నుండి 45వ వార్డు వరకు,  అకౌంట్ సెక్షన్ గదిలో ఇద్దరు వార్డు ఆఫీసర్ ల ఆధ్వర్యంలో 46 నుంచి 49 వార్డుల వరకు ఆయా అవార్డులో పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తారు.  నామినేషన్ల స్వీకరణ జనవరి 28 నుండి 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు, 31 న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఫిబ్రవరి 11న పోలింగ్ , 13 నా ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటల నుండి కొనసాగుతుంది, లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు.

ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఓటర్ల పాత్ర కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -