Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నఏడ్గిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సర్పంచ్

చిన్నఏడ్గిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలో చిన్న ఏడ్గి గ్రామంలో జిపి కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ జాదవ్ సుమిత్ర భాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పథాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో సర్పంచ్ పాల్గొ న్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో జాతీయ పతాకాన్ని గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా  ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం  ఇంగు భారతి విట్టల్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాకృతిక కార్యక్రమాలను గ్రామ పెద్దలతో కలిసి తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,  ఉప సర్పంచ్ , జిపి కార్యవర్గ సభ్యులు,  జి పి కార్యదర్శి , ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం ఇంగు భారతి విఠల్, అంగన్వాడీ టీచర్ చంద్రకళ , గ్రామస్థాయి నాయకులు , గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -