- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన పడంపల్లి గ్రామ కి సంబంధించిన లబ్ధిదారులకు గృహాల నిర్మాణంలో ముమ్మరం చేశారు. పడంపల్లి గ్రామానికి ఇందిరమ్మ గృహ పథకంలో ఏడు మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు అయ్యాయి. అందులో ఇద్దరు పునాది దశలో ఉండగా మరో ముగ్గురు స్లాబు లెంటల్ లెవల్లో ఉన్నాయి. బిరాధార్ విట్టల్ అనే లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి దశలో నిర్మాణం పూర్తికావస్తు ఉంది. ఇప్పటికే పలు నిర్మాణం చేస్తున్న గృహ లబ్ధిదారులకు వివిధ దశలలో డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకోటి రాబోయే 15 రోజులలో గృహప్రవేశానికి సిద్ధంగా ముస్తాబు అవుతోంది.
- Advertisement -



