- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చెలిమల్ల మల్లికార్జున రెడ్డికి ఉత్తమ ప్రశంస అవార్డు దక్కింది. ఆయన విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన నేపథ్యంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భూపా లపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ చేతులమీదుగా మల్లికార్జున రెడ్డి ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -



