Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోపూర్ సర్పంచ్ కు ఘన సన్మానం

సోపూర్ సర్పంచ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సోపూర్ గ్రామపంచాయతీకి నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ దంతోడ్ తుకారంను గ్రామస్తులు, జిపి కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి అశోక్ రాథోడ్ ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జెండాను వందనం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ నిరుపేదనైనా నేను ఎటువంటి విద్యాభ్యాసం లేదు అయినా గ్రామస్తులు పెద్దమనుషుల కోరిక మేరకు సర్పంచ్ గా నన్ను నిలబెట్టి గెలిపించినందుకు గ్రామస్తుల రుణం తీర్చుకునే విధంగా గ్రామ అభివద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతోడ్ తుకారం , జిపి కార్యదర్శి అశోక్, మాజీ సర్పంచ్ భర్త శివాజీ పటేల్ , వార్డు సభ్యులు, జాన్సన్ , గ్రామ పెద్దలు ,యువకులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -