Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ సర్పంచ్ ను సన్మానించిన బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్

మాజీ సర్పంచ్ ను సన్మానించిన బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకల సందర్భంగా తన పాత మిత్రుడు సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్ పవను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ మాట్లాడుతూ.. మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉండేవి కావని అన్నారు. ప్రస్తుతము ఇంగ్లీష్ మీడియం స్కూలు చదువుకునే విద్యార్థులకు మననుండే ప్రారంభమైందని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజల పిల్లలకు విద్యను అందించాలని ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను 30 మందితో ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు బాగానే వస్తున్నారని అన్నారు. అంతకుముందు గణప్రాంతర దినోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దంపతులు, మరియు గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ , గ్రామ పెద్దలు , యువకులు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -