మునిగలవీడు సర్పంచ్ బొలికొండ చైతన్య నాగరాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షుడగా బొజ్జ ఉపేందర్ ను నూతనంగా ఎన్నిక అయిన సందర్భంగా శాలువతో ఘనంగా సత్కరించినట్లు ఆ గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు తెలిపారు. మంగళవారం భూకే ఇచ్చి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఈ గ్రామంలో ఈ సంఘం గత కొన్ని నెలల నుండి సంవత్సరం ఒకసారి నూతన అధ్యక్షునిగా ఎన్నుకుంటారని తెలిపారు.
అందులో భాగంగా ఈ సంవత్సరం నూతన అధ్యక్షునిగా బొజ్జ ఉపేందర్ ను ఎన్నుకున్న అట్ల తెలిపారు. గ్రామంలో ఆ కాలనీలోని వారి అభివృద్ధి కోసం ఈ సంఘం పాటుపడుతుందని అన్నారు. ఈ సంఘం అభివృద్ధికి నా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కన్నా సతీష్, నాయిని బ్రాహ్మణ సంఘం మండల ప్రధాన కార్యదర్శి నాగవెల్లి బాలరాజు , అంబేద్కర్ యువజన సంఘం మాజీ కోశాధికారి ధర్మారపు శ్రీకాంత్, అంబేద్కర్ యూత్ సభ్యులు నకిర కంటి వెంకన్న, కొమ్ము యాకన్న , నకిరా కంటి కృష్ణ, ఇసంపల్లి కృష్ణ, బాబురాజు, వెల్తూరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.



