Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొల్ల కురుమలు ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుండాలి

గొల్ల కురుమలు ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుండాలి

- Advertisement -

జిఎంపిఎస్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు ఆకుల రాజు యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి హరీష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

గొల్ల కురుమల యాదవ సోదరులు ఆర్థికంగా రాజకీయంగా రంగాలలో ఎదగాలని జి ఎం పి ఎస్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు ఆకుల రాజు యాదవ్ సంగం జిల్లా సహాయ కార్యదర్శి హరీష్ అన్నారు. గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం 2026 నూతన క్యాలెండర్ ను మంగళవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు, మండల కేంద్ర సర్పంచ్ పులి వెంకన్న, ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రెల మేకల పెంపకం దార్ల యువత అన్ని రంగాలలో ముందు ఉండాలని, విద్యారంగంలో కొంత వెనకబడి ఉన్నామని అది అధిగమించేందుకు తల్లిదండ్రులందరూ కృషిచేసి పిల్లలను ఉన్నంత చదువులు చదివించాలని వారు ఈ సందర్భంగా కోరారు.

యువత విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుండి ఈ దేశ భవిష్యత్తుకు మంచి దారులు వేసేలా యువతరం ముందుకు రావాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా గొల్ల కురుమల హక్కులను సాధించుకునేందుకు గొర్రెల పెంపకం దారులందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిపిఓ ఉప్పలయ్య, నాయకులు చందు రాజ్ కుమార్ యాదవ్, కసరమైన విజయ్ యాదవ్, గుండెబోయిన యాకన్న, తోట నాగరాజు, దొంతుల మురళి, బట్ట మేకల వెంకటేష్, దేశ బోయిన ఎల్లయ్య, ఆకుల నరసయ్య, గజ్జల వీరన్న. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -