నవతెలంగాణ-రాయికల్
మండలంలోని తాట్లావాయి శివారులో ఉన్న సీతారామస్వామి ఆలయానికి సంబంధించి తాట్లావాయి, ధర్మాజీపేట్ గ్రామాల మధ్య వివాదం నెలకొంది. ధర్మాజీపేట్ గ్రామస్తులు ఆలయంలో తమకు పొత్తు ఉందంటూ తాట్లావాయి గ్రామంలో సుమారు 200 మంది గొడవకు దిగారని, ఈ విషయంపై తహసీల్దార్ నాగార్జునకు తాట్లావాయి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సంబంధిత దేవాలయాన్ని తాట్లావాయి గ్రామస్తులే నిర్మించారని వారు తెలిపారు. ఇక ధర్మాజీపేట్ గ్రామస్తులు తాహాసీల్దార్ కార్యాలయంలో వేరుగా ఫిర్యాదు చేస్తూ.. పూర్వీకుల కాలం నుంచి ఇరు గ్రామాల ప్రజలు కలిసి జాతర, కళ్యాణం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆ భూమిని దేవాలయం పేరున నమోదు చేసి ఆలయాన్ని ఎండోమెంట్ శాఖ పరిధిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సీతారామస్వామి ఆలయంపై ఇరు గ్రామాల మధ్య వివాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



