ఐద్వా జాతీయ మహసభల్లో సేవల్ని ప్రశంసిస్తున్న ప్రతినిధులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరంతరం అప్రమత్తం. వైద్యపరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా అత్యవసరంగా వాలిపోయేలా ఏర్పాట్లు. 24/7 అందుబాటులో ఉండే డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది. అన్నీ ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు. ఐద్వా 14వ జాతీయ మహాసభలు ఈనెల 25 నుంచి హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. 26 రాష్ట్రాల నుంచి 800మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. అవసరమైన వారికి వైద్యపరంగా సేవలు అందించేందుకు ఈ ప్రాంగణంలోనే ప్రజావైద్యశాలను ఐద్వా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. డాక్టర్ రమాదేవి కన్వీనర్‌గా ఈ వైద్యశాల సేవల్ని కొనసాగిస్తున్నది. ఆమెతో పాటు డాక్టర్ల బృందంలో డాక్టర్ శారద, డాక్టర్ సిందూర, డాక్టర్ కౌశికి, డాక్టర్ కీర్తన్, డాక్టర్ దీప్తి, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ లారామీనన్ వంటి వారు ఉన్నారు. నర్సింగ్ సేవల్ని సిస్టర్ నీల, రాజ్యలక్ష్మి, సుజావతి, కమలమ్మ అందిస్తున్నారు. వారికి సహాయకులుగా డి.వీరయ్య, విజరు కుమార్, రాజుభట్, ముకుంద్ కులకర్ణి, విజరు, చారి, దురా ్గప్రసాద్, నరేందర్‌రెడ్డి ఉన్నారు. మహాసభల ప్రాంగణ మంతా కలియతిరుగుతూ ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసర మైనా తక్షణం అందిస్తున్నారు. వైద్యంతో పాటు మందుల్ని కూడా అందుబాటులో ఉంచారు. బీపీ, షుగర్ పరీక్షలు అక్కడికక్కడే చేసి, కేస్ స్టడీని బట్టి మెడిసిన్స్ ఇస్తున్నారు. ప్రధానంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం కొంత కష్టమే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందిపడుతున్న వారికి వైద్యసలహాలను అందిస్తు న్నారు. అవసరమైవారికి అక్కడే ప్రాథమికవైద్యసేవలు లభిస్తున్నాయి. వీరి సేవల్ని మహాసభకు హాజరైన ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. మహాసభలు ప్రారంభమైన తొలిరోజు దాదాపు 450 మందికి, రెండోరోజు 280మందికి వైద్యసేవలు అందిం చారు. ఆ తర్వాతా అవసరమైన వారికి సేవల్ని కొనసాగి స్తూనే ఉన్నారు. ‘మా ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నట్టు ఉంది’ అని వారి సేవల్ని ప్రతినిధులు కొనియాడుతుండటం విశేషం.
వైద్య సౌకర్యాలు భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



