Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాఉద్యమాలను బలోపేతం చేయాలి

ప్రజాఉద్యమాలను బలోపేతం చేయాలి

- Advertisement -

యాట నర్సింహారెడ్డి సంతాప సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-నకిరేకల్‌

సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు యాట నర్సింహారెడ్డి చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ప్రజల కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్‌ హాల్లో మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల అధ్యక్షతన ప్రజా ఉద్యమాల పోరాట యోధుడు యాట నర్సింహారెడ్డి సంతాప సభ నిర్వహించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ హాజరై ప్రసంగించారు.కార్మికుల హక్కులు, రైతుల సమస్యలు, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన నిజమైన కమ్యూనిస్టు నాయకుడు యాట నర్సింహారెడ్డి అని కొనియాడారు. ఆయన అకాల మృతి సీపీఐ(ఎం)కు, కార్మిక వర్గానికి, పేదప్రజలకు తీరనిలోటు అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.
సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, రాచకొండ వెంకట గౌడ్‌, పట్టణ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌, యూటీఎఫ్‌ నాయకులు ఎడ్ల సైదులు, రాజశేఖర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పన్నాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -