నవతెలంగాణ-హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి దౌపది ముర్ము ప్రసంగించారు. సామాజిక న్యాయం, పురోగతి, అభివద్ధే ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. 25 కోట్ల మంది పేదరిక నుంచి విముక్తి లభించిందని, దళిత్, వెనుకబడిన తరగతుల, ఎస్టీ తెగల ఉన్నతికి కృషి చేస్తోందని,2047 ఏడాది నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గుర్తింపు బడుతోందని దీమా వ్యక్తం చేశారు. అంతకముందు సభ ప్రారంభానికి ముందు పీఎం మోడీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్, రాజ్యసభ ప్రతిపక్షనాయకుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు స్వాగతం పలికారు.
బడ్జెట్ సమావేశాలు 65 రోజుల పాటు 30 సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ 2న ముగుస్తాయి, స్టాండింగ్ కమిటీల గ్రాంట్ల డిమాండ్ల పరిశీలన కోసం ఫిబ్రవరి 13 నుండి మార్చి 9 వరకు విరామం ఉంటుంది.



