నవతెలంగాణ – హైదరాబాద్ : ఐద్వా అఖిల భారత అధ్యక్షురాలిగా పి కె శ్రీమతి, ప్రధాన కారదర్శిగా కొనినికా ఘోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐద్వా 14వ అఖిల భారత మహాసభల్లో బుధవారం ఐద్వా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా 16 మంది, కార్యదర్శులుగా 10 మంది, సహాయ కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు సేవలందించిన ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి, సెక్రటరీ రమాదేవి తో పాటు మరో 13 మంది సెంట్రల్ కమిటీ నుంచి రిలీవ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మహాసభకు హాజరైన ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య నూతన కమిటీని మరియం దావలే ప్రకటించారు.

నూతన కోశాధికారిగా తపసి ప్రహరాజ్,తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షురాలు అరుణజ్యోతి, ప్రభావతి, ఆశాలత, బండి పద్మ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి జాతీయ కమిటీలో చోటు దక్కింది.



