దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ కెమెరామెన్‌గా పని చేశారు.
దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ‘అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ క్రియేట్ చేసిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది. ఈ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది. నేను ఇంత వరకు 8 సినిమాలు చేశాను. మొదటి సారిగా ఓ మనిషి మీద నమ్మకం పెట్టుకుని ప్రేమ్ చంద్ కోసం ఈ మూవీని చేశాను. మిథున్ తన మ్యూజిక్‌తో మాయ చేశారు’ అని తెలిపారు.
‘హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా నాన్న నాకు దేవుడి కంటే ఎక్కువ. ఆ నాన్ననే ఎదురించి సినిమాను తీస్తున్నానంటే.. ఎలాంటి సినిమాని తీస్తుంటానో అర్థం చేసుకోండి. సినిమానే అంతా మాట్లాడుతుంది. నచ్చింది చేయడమే జీవితం’ అని దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు అన్నారు. క్రితిక సింగ్ మాట్లాడుతూ, ‘ప్రేమ్ చంద్ లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్’ అని చెప్పారు. మీషా నారంగ్ మాట్లాడుతూ,’ఈ సినిమా కన్నులపండుగగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో సినిమాని షూట్ చేశాం. ప్రేమ్ చంద్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచయిత – దర్శకుడు : కిలారు ప్రేమ్ చంద్, నిర్మాతలు: హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు, సంగీతం: మిథున్ ముకుందన్, ఎడిటర్ : భువనేష్ మణివన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: శివ కామేష్ డి.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘శబార’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



