Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలులైఫ్‌ మొత్తం 'గాబరా.. గాబరా..'

లైఫ్‌ మొత్తం ‘గాబరా.. గాబరా..’

- Advertisement -

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్‌ రాజు.పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘గాబరా గాబరా’ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్‌ రాయగా, ఆదిత్య రవీంద్రన్‌ కంపోజ్‌ చేశారు. సంతోష్‌ నారాయణన్‌ పాడారు.

”గాబరా గాబరా సోదరా లైఫ్‌ మొత్తం, కాలమే తన్నెరా లక్‌ని ఆమడ దూరం, బంతి భోజనంలో బంతిని వడ్డిస్తారా, చేపను వేపాక చెరువులో వేస్తారా, సంబంధం లేని పనులనే, చేస్తున్నాం సిగ్గే పడకనే, చెత్త చేరింది లోనే, ‘గాబరా గాబరా సోదరా లైఫ్‌ మొత్తం, కాలమే తన్నెరా లక్‌ ని ఆమడ దూరం, జానెడుగా పైనకి ఎక్కుదమంటే, బారెడుగా జీవితం కిందకు జారిపోతుందే…’ అంటూ కలిసి రాని లైఫ్‌కు ఫేట్‌ ఇచ్చే ట్విస్ట్‌లు, ఎంత ప్రయత్నించినా ఎదురయ్యే రెడ్‌ లక్‌లు ఎలా ఉంటాయో చూపిస్తూ ఈ పాట సాగుతుంది అని చిత్రయూనిట్‌ తెలిపింది. సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌ – మైఖేల్‌ బీఎఫ్‌ఏ, ఎడిటర్‌ – గణేష్‌ శివ, డీవోపీ – దినేష్‌ పురుషోత్తమన్‌, మ్యూజిక్‌ – ఆదిత్య రవీంద్రన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌ఎస్‌ వర్మ, సమర్పణ – యూవీ క్రియేషన్స్‌,. నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్‌, అజయ్ కుమార్‌ రాజు. పి., రచన, దర్శకత్వం – అశ్విన్‌ చంద్రశేఖర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -