Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ

మున్సిపల్‌ ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మెన్‌ జావెద్‌ లతీఫ్‌, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి ప్రకటించారు. అంతకుముందు తెలంగాణ జాగృతి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతల చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు భవిష్యత్‌ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కవితతో ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కన్వీనర్‌ జోజిరెడ్డి, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఆర్‌.వీ.ఆర్‌ ప్రసాద్‌, తేజ్‌ దీప్‌ రెడ్డి, కొండ దయానంద్‌, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్‌ దీప్‌ రెడ్డి, ఫైనాన్స్‌ సెక్రటరీ కె.నరేందర్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్‌, సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య, జనరల్‌ సెక్రెటరీ కృష్ణమూర్తి సహా ముఖ్య నేతల సమావేశమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -