– మధ్యలో వదిలే ప్రసక్తే లేదు
– చివరి వరకు పోరాడుతాం : మీడియా సమావేశంలో ఐద్వా నేతలు
– ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”మహిళలకు హక్కులిస్తే తీసుకుంటాం…లేదంటే లాక్కుంటాం…” అని ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల్లో ఐద్వా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికయ్యారు. అనంతరం ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి, ఐద్వా జాతీయ కోశాధికారి తపసి ప్రహరాజ్, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఉపాధ్యక్షులు మరియం ధావలే, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మల్లు లక్ష్మితో కలిసి కనినిక మీడియా సమావేశంలో మాట్లా డారు. మహిళా హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామనీ, మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, మనువాదాన్ని తిరస్క రిస్తూ, మహిళల హక్కుల కోసం ముందు కెళ్లే విషయంలో ఏడు అంశాలపై మహాసభలో క్షుణ్ణంగా చర్చించామన్నారు. కార్పొరేట్, మతోన్మాదులు, బీజేపీ ప్రభుత్వం అదేపనిగా పేదలు, దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కులను హరిస్తున్నా యని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల హింసల్లో ప్రధాన బాధితులుగా మహిళలే సమిధలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీల ప్రభుత్వమే తప్ప ప్రజల ప్రభుత్వం కాదని విమ ర్శించారు. మైక్రోఫైనాన్స్ వేధింపులకు మహిళలు, ఎక్కువగా అణగారిన వర్గాల మహి ళలే బాధితులుగా నిలుస్తున్నారని తెలిపారు. బ్యాంకులు పేద మహిళలకు రుణాలివ్వకుండా బీజేపీ విధానాలు న్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకులు మిలియనీర్లు, బిలియనీర్లకు మాత్రమే రుణాలిస్తాయనీ, వారు ఆ రుణాలను ఎగ్గొడుతున్నారని చెప్పారు. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో జనాభాలో సగమున్న మహిళలకు మిగిలిన ఏకైక మార్గం పోరాటమేనని తేల్చి చెప్పారు. వామపక్షాల సహకారంతో కేంద్రంలో యుపీఏ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన నరేగా చట్టంలో అత్యధిక మంది మహిళలు ఉపాధి పొందారని గుర్తుచేశారు. ఆ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే కార్మికుల సార్వత్రిక సమ్మెలో ఐద్వా దేశవ్యాప్తంగా పాల్గొంటుందని తెలిపారు.
చట్టాల్లో మనువాద మార్పులు.. మహిళలకు పొంచి ఉన్న పెను ప్రమాదం : మరియం ధావలే
బీజేపీ సర్కారు చట్టాల్లో మనువాద భావజాలంతో తీవ్రమైన మార్పులు చేస్తున్నదనీ, వీటితో మహిళలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు మరియం ధావలే హెచ్చరించారు. మహిళలకు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఐద్వా మహాసభలో సామ్రాజ్యవాద ప్రభావం, అసంఘటిత రంగంలో హక్కులు దక్కని మహిళలు, పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్, స్మార్ట్ సిటీలో ప్రజలకు దక్కని సౌకర్యాలు, కులం, జెండర్ ఐడెంటిటీపై చర్చించామన్నారు.
నిరంతర పోరాటం : మల్లు లక్ష్మి
మహిళల సమస్యలపై ఐద్వా నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. ఐద్వా మహాసభల విజయవంతానికి సహకరించిన వారందరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఐద్వా ర్యాలీ, బహిరంగ సభ, మహాసభల ఏర్పాట్ల వరకు అనేక మంది సహకరించారని చెప్పారు.
హక్కులిస్తే తీసుకుంటాం.. లేదంటే లాక్కుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



