Thursday, January 29, 2026
E-PAPER
Homeబీజినెస్భారీ విస్తరణలో హెచ్‌ఏఎల్‌

భారీ విస్తరణలో హెచ్‌ఏఎల్‌

- Advertisement -

ఏటా రూ.2500 కోట్ల పెట్టుబడులు
ప్రభుత్వ రంగ విమానయాన తయారీ దిగ్గజం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. కొత్త విమానాలు తయారీ సహా రెవెన్యూను పెంచుకోవాలని నిర్దేశించుకుంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏటా రూ.2,500 కోట్ల పెట్టుబడుల పైగా వ్యయం చేయనున్నామని హెచ్‌ఎఎల్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డికె సునీల్‌ తెలిపారు. బుధవారం వింగ్స్‌ ఇండియా ప్రదర్శన వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే పదేండ్లలో పౌర విమానయాన రంగం నుంచి వచ్చే వాటాను 25 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ప్రస్తుతం ఇది నాలుగైదు శాతంగా ఉందన్నారు.
వచ్చే మూడేండ్లలో తన ప్రస్తుత ప్లాంట్ల ద్వారానే ఎస్‌జె100 విమానాలను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఈ విమానాల తయారీ కోసం రష్యాకు చెందిన పీజేఎస్‌సీ- యూఏఏసీ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదర్చుకు న్నామన్నారు. ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు వేచి చూడకుండా, రష్యా నుంచి నేరుగా 10 నుండి 20 విమానాలను లీజుకు లేదా నేరుగా కొనుగోలు చేసి దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోన్నామన్నారు.. వచ్చే ఒకటిన్నర ఏళ్లలోనే సుమారు 10 విమానాలను తీసుకురావాలన్నది సంస్థ ఆలోచనగా ఉందన్నారు. ఇప్పటికే పలువురు ప్రాంతీయ విమానయాన ఆపరేటర్లు సుమారు 20 విమానాల కోసం ఆసక్తి చూపారని పేర్కొన్నారు. దీంతో పాటు అధునాతన ‘ధృవ్‌-ఎన్‌జీ’ హెలికాప్టర్ల కోసం పవన్‌ హన్స్‌ నుండి 10 ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇవి ఓఎన్‌జీసీ కార్యకలాపాలకు ఉపయోగపడతాయని వివరించారు. దేశీయ ప్రాంతీయ అనుసంధానత కోసం ఎస్‌జె100 లాంటి సుమారు 200 విమానాల అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.31,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. ఈ ఏడాది 7-8 శాతం వృద్ధి అంచనా వేస్తోం దన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -