Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే దానంకు నోటీసులు

ఎమ్మెల్యే దానంకు నోటీసులు

- Advertisement -

అనర్హత పిటిషన్‌పై 30న స్పీకర్‌ విచారణ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారించనున్నారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని దానం నాగేందర్‌ కు బుధవారం నోటీసులు జారీచేశారు. అలాగే ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి న్యాయవాదులకు స్పీకర్‌ నోటీసులు పంపారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజు విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపున సాక్షాలను స్పీకర్‌ నమోదు చేయనున్నారు.

అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలి : స్పీకర్‌కు దానం వినతి
బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విన్నవించారు. నేను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయబడలేదు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్‌ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లాను. మీడియా వార్తల ఆధారంగా నేను పార్టీ మారినట్టు బీఆర్‌ఎస్‌ అనుకుంటున్నది. ఆ పార్టీ అనర్హత పిటిషన్‌ సరికాదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -