- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని విద్యార్థులను కోరారు. తెలంగాణలో అవకాశాలు, బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను చాటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.



- Advertisement -



