నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని ఉట్లపల్లిలో గ్రామ సర్పంచి, రమావత్ లక్ష్మణ్, ఉపసర్పంచి బీరెడ్డి బాల్ రెడ్డి గ్రామ పంచాయతీ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా ఉపసర్పంచిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలను దృష్టి సారించారు. ముఖ్యంగా ఉట్ల పల్లినుంచి, పెద్దగట్టు రోడ్డు, ఉట్లపల్లి నుంచి భాసోనిబావి రోడ్డునుంచి పర్వేదుల, చలకుర్తి, కుంకుడు చెట్టుతండా మీదుగా హాలియాకు దేవరకొండ నుంచి ఆర్టీ సి బస్సు ప్రతిరోజు వెళుతుంది. రోడ్డుపై వున్న గుంతలు పూడ్చిడమే కాక రోడ్లకు ఇరువైపులా వున్న కంపచెట్లు, పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచి, ఉపసర్పంచి జేసీబీ తో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించటం మొదలుపెట్టారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యకం చేస్తున్నారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో మంచినీటి సౌకర్యం, పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మురుగు కాలువ నిర్మాణం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సర్పంచి, ఉపసర్పంచి తెలిపారు.
కంపచెట్ల తొలగింపు పై హర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



