నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మరో దొంగతనం జరిగింది. కాటారం గ్రామానికి చెందిన మంత్రి రాజయ్య అనే వ్యక్తి హమాలీ సంఘం కార్యాలయం వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్ళాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూసేసరికి తన ద్విచక్ర వాహనం లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న సిసి ఫోటోని పరిశీలించారు. ఈ క్రమంలో తన వాహనాన్ని అపరిచిత వ్యక్తి దొంగలించి తీసుకెళ్లడాన్ని చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలించిన రెండు గంటల వ్యవధిలోనే దొంగను చాకచక్యంగా ఎస్సై శ్రీనివాస్ పట్టుకున్నారు. దొంగ మహారాష్ట్రలోని వడిదం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
ద్విచక్ర వాహన దొంగను పట్టుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



