- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం పొన్కల్ మేజర్ పంచాయతీ పరిధిలోని రామ్నగర్ రామాలయంలో గురువారం అఖండ భజన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు నిర్విఘ్నంగా ఈ భజన కొనసాగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి భజనలో పాల్గొనాలని కోరారు. ఆధ్యాత్మిక చింతనతో గ్రామంలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. భక్తులు భజన కారులు పాల్గొన్నారు.
- Advertisement -



