Thursday, January 29, 2026
E-PAPER
Homeఖమ్మంరేపటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా నమోదు 

రేపటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా నమోదు 

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్
నవతెలంగాణ – బోనకల్

రేపటి నుంచి పార్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నట్లు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ తెలిపారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. డీలర్, షాప్‌ల వద్ద గందరగోళం, క్యూ లైన్లు తగ్గుతాయన్నారు.పంట, భూమి విస్తీర్ణం ఆధారంగా న్యాయమైన కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను రైతులు వేసిన పంటను బట్టి వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ దగ్గర, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు నమోదు చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని తెలిపారు.  మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని రైతులు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. కౌలు దారులు అయితే ఎవరి దగ్గర అయితే భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ రైతు యొక్క పట్టాదారు పాస్ బుక్ నెంబరు ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.

అయితే ఆ పట్టాదారు ఓటీపీ చెప్పాల్సి ఉంటుందన్నారు.ఈ యాప్ ను రైతులకు అలవాటు చేయటానికి, అవగాహన కల్పించడానికి ప్రతి ఔట్లెట్ దగ్గర వ్యవసాయ శాఖ ద్వారా ఒక వ్యక్తిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సంబంధిత ఏ ఈ ఓ రైతులకు సహాయం చేస్తారని తెలిపారు. రైతులందరూ ఈ యొక్క యాప్ ను వినియోగించుకొని యూరియాను కొనుగోలు చేసుకోవాలని కోరారు. యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇస్తారని, గతంలో లాగా మాన్యువల్ లాగా యూరియా ఎవరని రైతులు అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -