– పంట నష్టాన్ని పరిశీలించిన అటవీ అధికారులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. అడవి పందుల దాడిలో మొక్కజొన్నకు పంట నష్టం వాటిల్లడంతో రైతు కోరే నర్సయ్య లబోదిబోమంటున్నాడు. గ్రామ శివారులోని చిన్న గుట్ట సమీపంలో రైతు కోరే నర్సయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. పంట చేతికొస్తున్న సమయంలో అడవి పందులు మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అడవి పందుల దాడిలో రెండు ఎకరాల్లో పంట ధ్వంసం అవ్వడంతో సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు రైతు నరసయ్య వాపోయాడు. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని ఈ సందర్భంగా నర్సయ్య విన్నవించారు. అడవి పందుల దాడిలో ధ్వంసమైన మొక్కజొన్న పంటను కమ్మర్ పల్లి అటవీ రేంజ్ అధికారులు, సిబ్బంది పరిశీలించి నష్టం వివరాలను సేకరించారు.
అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



